అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: టెస్టుల్లో ఇంగ్లండ్‌ జట్టు అరుదైన రికార్డును నెలకొల్పింది. 147 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో 5 లక్షలకు పైగా పరుగులు చేసిన తొలి జట్టుగా ఇంగ్లండ్‌ అవతరించింది. 1082వ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మధ్య జరగతున్న టెస్టులో ఈ ఘనత సాధించింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా 4,28,868 పరుగులతో రెండో స్థానంలో, టీం ఇండియా 2,78,751 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాయి.