అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన వాహనాలను ఈనెల 11న వేలం వేయనున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నగరంలోని బోర్గాం(పి)లో గల కార్యాలయంలో వేలం ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు బుధవారం ఉదయం 10 గంటలకు కార్యాలయానికి రావాలని సూచించారు.