అక్షరటుడే, వెబ్‌ డెస్క్‌ : సీఎం రేవంత్‌రెడ్డి సైనిక సంక్షేమం కోసం రూ. లక్ష విరాళాన్ని కల్నల్‌ రమేశ్‌ కుమార్‌కు అందజేశారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని సైనిక్‌ వెల్ఫేర్‌ విభాగం డైరెక్టర్‌ కల్నల్‌ రమేశ్‌ కుమార్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలిసింది. ఈసందర్భంగా కల్నల్‌ రమేశ్‌ సీఎం రేవంత్‌కు త్రివర్ణపతాక స్టిక్కర్‌ను అందజేశారు.