అక్షరటుడే, కామారెడ్డి టౌన్‌: బీడీ కార్మికులకు ఆంక్షలు లేని భృతి అందించాలన్న డిమాండ్‌తో ఈనెల 11న తలపెట్టిన చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయాలని బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి సిద్ధిరాములు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం జిల్లా కార్యాలయంలో మాట్లాడారు. బీడీ కార్మికులకు ఫిబ్రవరి 28 కటాఫ్‌ తేదీని తొలగించి, షరతులు లేకుండా రూ.4,016 జీవన భృతి అందించాలన్నారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెల్లయ్య, శ్రామిక శక్తి తెలంగాణ బీడీవర్కర్స్‌ యూనియన్, ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షురాలు అనూసుయ, జిల్లా అధ్యక్షురాలు వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.