అక్షరటుడే, కామారెడ్డి: ప్రజల సౌకర్యార్థం ఎస్పీ ఆఫీస్లో ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ సింధూశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. సంబంధిత ఫిర్యాదుపై స్టేషన్లలో చర్యలు తీసుకోని పక్షంలో సెంట్రల్ సెల్ 8712686142 నంబరు కు ఫోన్ కాల్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించాలని సూచించారు.