అక్షరటుడే, కామారెడ్డి: బాబు జగ్జీవన్ రాం ఆశయసాధనకు కృషి చేద్దామని కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్రేట్ ఆవరణలో శుక్రవారం జగ్జీవన్రాం జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జగ్జీవన్రాం అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. అంటరానితనం, కులవివక్ష నిర్మూలన కోసం పోరాటం చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిణి రజిత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, జిల్లా పౌరసరఫరాల అధికారి మల్లికార్జున బాబు, నోడల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.