అక్షరటుడే, ఇందూరు: సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు రాజు తెలిపారు. నిజామాబాద్ లో 900, కామారెడ్డిలో 750 మంది ఉద్యోగులు పెన్ డౌన్, చాక్ డౌన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గత 11 నెలలుగా తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు.