అక్షరటుడే, బోధన్: ఎడపల్లి మండలం టానాకాలన్‌కు చెందిన ఓ వ్యక్తి సైబర్ మోసగాళ్ల బారిన పడి రూ.28 వేలు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. తన క్రెడిట్ కార్డు డీయాక్టివేట్ కావడంతో గూగుల్‌లో బ్యాంక్ మెయిల్ ఐడీని సెర్చ్ చేసి యాక్టివేషన్ కోసం మెయిల్ పెట్టాడు. దీంతో వెంటనే ఓ లింక్‌తో కూడిన రిప్లయ్ వచ్చింది. బాధితుడు లింక్‌పై క్లిక్ చేయడంతో బ్యాంక్ ఖాతా నుంచి రూ.28వేలు డ్రా అయ్యాయి. దీంతో మోసపోయినట్లు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు