అక్షరటుడే, ఆర్మూర్: జిల్లాస్థాయి బేస్‌బాల్ సీనియర్స్ సెలక్షన్స్ లో జక్రాన్‌పల్లికి చెందిన మల్లమారి ప్రశాంత్ కుమార్ ప్రతిభ కనపరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. ఆయన ప్రస్తుతం ఆర్మూర్ కాంతి హైస్కూల్లో పీఈటీగా పనిచేస్తున్నాడు. రాష్ట్రస్థాయికి ఎంపికైన ఆయనను కాంతి హైస్కూల్ కరస్పాండెంట్ వేల్పూర్ గంగారెడ్డి, జిల్లా బేస్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్ మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్, సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగామోహన్ అభినందించారు.