అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీని వీడిన విషయం తెలిసిందే. తాజాగా.. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ పదవులు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీ అధిష్టానానికి లేఖ పంపించారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.