అక్షరటుడే, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. గురువారం ఉదయం మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 12.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 160, నిఫ్టీ 65 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. ఎఫ్ఎంసీజీ, ఆటో, హెల్త్ సెక్టార్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. నిఫ్టీ ఫిఫ్టీలో అదాని ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఎయిర్ టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో ఒక శాతానికి పైగా లాభంతో ఉండగా.. అపోలో హాస్పిటల్స్, హీరో మోటార్, మారుతి, టాటా మోటార్, హెచ్యూఎల్, టాటా కన్స్యూమర్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, ఎల్టీ అవుతున్నాయి.