అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని గతంలో హామీ ఇచ్చిన కేంద్రం.. ప్రస్తుతం ఆ ఆలోచన లేదని చెప్పడం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడమేనని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటవుతున్న సమయంలో ఖమ్మం జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తమకు అలాంటి ఆలోచనే లేదని చెప్పడం అన్యాయమన్నారు. కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని ఆమో డిమాండ్‌ చేశారు.