అక్షరటుడే, బాన్సువాడ: కాంగ్రెస్ బాన్సువాడ నాయకులు గురువారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ను కలిశారు. బాన్సువాడ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా నియమితులైన మంత్రి అంజవ్వ గణేశ్ దంపతులు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షంలో పీసీసీ అధ్యక్షుడి నివాసానికి వెళ్లారు. తన నియామకానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ రావు, ప్రతాప్ సింగ్, గణేశ్, భాస్కర్ రెడ్డి, కమ్మ సత్యనారాయణ, అంజద్ ఖాన్, భాను తదితరులు పాల్గొన్నారు.