అక్షరటుడే, వెబ్డెస్క్: హైడ్రాకి ధనిక, పేద అనే తేడా లేదని, చెరువులను ఎవరు ఆక్రమించినా చర్యలు ఉంటాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం, రైతు భరోసా సంక్రాంతి నుంచి అమలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ చేసిన అప్పులకు రూ.64 వేల కోట్లు అసలు, వడ్డీలు కడుతున్నామని చెప్పారు.