అక్షరటుడే, బిచ్కుంద: అంగన్‌వాడీ కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీల సంఘం జిల్లా అధ్యక్షుడు సురేశ్‌ డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ‘ఛలో హైదరాబాద్‌’ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌కు తరలివెళ్లారు. సమస్యలు పరిష్కరించకపోతే ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు.