అక్షరటుడే, ఆర్మూర్: అగ్ని ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమవగా.. బాధితులకు తక్షణమే సాయం అందించాలని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. భీమ్‌గల్ మండలం కున్యా తండాలో బూక్య మోతీలాల్ ఇల్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. దీంతో స్పందించిన ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి తహశీల్దార్ షబ్బీర్‌కు ఫోన్ చేశారు. ఇందిరమ్మ ఇంటి పథకం కింద ఇల్లు ఇవ్వాలని ఆదేశించారు. తక్షణమే బాధితులకు నిత్యావసరాలు అందించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.