అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. డిమాండ్లను పరిష్కరించాలని ఆశా వర్కర్లు ఆందోళనలకు దిగడంతో వారిని విధుల నుంచి తొలగించాలని ప్రభుత్వ ఆలోచిస్తున్నట్లు తమకు నిర్దిష్టమైన సమాచారం ఉందని పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వం గనుక ఆశా వర్కర్లను విధుల నుంచి తొలగిస్తే మరో పోరాటం తప్పదని స్పష్టం చేశారు.