అక్షరటుడే, వెబ్‌డెస్క్: అదానీ వ్యవహారంపై పార్లమెంట్‌లో విపక్షాల నిరసనలతో సభా కార్యక్రమాలు సజావుగా జరగడంలేదు. ఈవిషయంపై సద్గురు జగ్గీ వాసుదేవ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘భారత్ ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి దీపస్తంభంగా ఉండాలని ఆకాంక్షిస్తున్న తరుణంలో పార్లమెంట్ సమావేశాలు పదేపదే వాయిదా పడటం నిరుత్సాహ పరుస్తోంది. భారత్‌లో సంపద సృష్టించేవారు, ఉద్యోగాలు ఇచ్చేవారిపై రాజకీయ విమర్శలు తగవు. ఏమైనా అవకతవకలు చోటు చేసుకుంటే.. చట్టప్రకారం చర్యలు ఉండాలి. అంతేకాని రాజకీయంగా ఫుట్‌బాల్ ఆడటం తగదు. భారతదేశం భవ్య భారత్‌గా మారాలంటే.. వ్యాపారాలు వృద్ధి చెందడం ఒక్కటే మార్గం’ అని సద్గురు పోస్టు పెట్టారు.