అక్షరటుడే, ఇందూరు: బాపూజీ వచనాలయాన్ని డిజిటల్ లైబ్రరీగా తీర్చిదిద్దుతామని అధ్యక్షుడు భక్తవత్సలం పేర్కొన్నారు. నగరంలోని బాపూజీ వచనాలయంలో గురువారం ఎన్నికల అధికారి ఎంఎస్ ఆచార్య నూతన కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం అధ్యక్షుడు భక్తవత్సలం మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు వేదికగా బాపూజీ వచనాలయాన్ని డిజిటల్‌గా మారుస్తామన్నారు. కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారి పులి జైపాల్, నారాయణ, కార్యదర్శి మీసాల సుధాకర్‌రావు, కోశాధికారి గంగాధర్‌రావు, ఉపాధ్యక్షులు భవంతి దేవిదాస్, బోగ అశోక్, సంయుక్త కార్యదర్శులు సాంబయ్య, దత్తాద్రి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.