అక్షరటుడే, బిచ్కుంద: హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ఈనెల 17న చేపట్టనున్న ధర్మాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ పిలుపునిచ్చారు. గురువారం బిచ్కుంద ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో దీక్ష పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ డీఏలను చెల్లించాలని, పీఆర్సీ అమలు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సందీప్, జిల్లా ఉపాధ్యక్షుడు వేద్ ప్రకాష్, కార్యదర్శి శివకాంత్, రాజ్‌కుమార్, సంగమేశ్వర్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.