అక్షరటుడే, కామారెడ్డి టౌన్: పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించాలని కామారెడ్డి ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కన్వీనర్ బొలేశ్వర్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అర్హత ఆధారంగా ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. అలాగే 200 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీక్షలో రాష్ట్ర నాయకులు లక్ష్మణ్, జిల్లా నాయకులు రాజు, గంగరాజు, భూపాల్, శేఖర్, కవిన్, లింగం, శివ రామకృష్ణ, రాజలింగం, తదితరులు పాల్గొన్నారు.