అక్షరటుడే, నిజాంసాగర్‌: రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు హెలీకాప్టర్‌లో నిజాంసాగర్‌కు చేరుకోనున్నారు. అనంతరం ప్రాజెక్టు ఆయకట్టుకు ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత శ్రీరాంసాగర్‌కు చేరుకుని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.