అక్షరటుడే, ఆర్మూర్: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని మున్సిపల్ కమిషనర్ రాజు సూచించారు. పట్టణంలోని ఎస్టీ బాయ్స్ హాస్టల్, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలను ఆయన పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలన్నారు. ఆయన వెంట సానిటరీ ఇన్ స్పెక్టర్ గజానంద్ ఉన్నారు.