అక్షరటుడే, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో తిరుమల 2వ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు బండరాళ్లను తొలగిస్తున్నారు. ఘాట్ రోడ్డులో వాహనాలు జాగ్రత్తగా నడపాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచించారు.