అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని పిప్రి సాంఘిక సంక్షేమ పాఠశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడలు గురువారం ముగిశాయి. ముగింపు వేడుకలకు మున్సిపల్ కమిషనర్ రాజు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతుల అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో రాజగంగారాం, పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.