అక్షరటుడే, ఆర్మూర్: కారుబోల్తా పడి ఒకరు మృతి చెందిన ఘటన ఆర్మూర్ మండలం పెర్కిట్ శివారులో చోటు చేసుకుంది. పట్టణ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ హయత్‌నగర్‌కు చెందిన చందు భీమ్‌గల్‌లోని కోటార్మూర్‌లో స్నేహితుడి మరదలు వివాహానికి వచ్చాడు. బుధవారం రాత్రి 1.30 ప్రాంతంలో తన స్నేహితులతో కలిసి డ్రైవర్ ప్రకాశ్(18)ను తీసుకుని పెర్కిట్ కాంతి హైస్కూల్ వైపు టీ తాగేందుకు వెళ్లారు. స్పీడ్ బ్రేకర్ వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడి చెట్టుకు ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ ప్రకాశ్‌కు తీవ్రగాయాలు కాగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మిగతా వారికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.