అక్షరటుడే, కామారెడ్డి: అధికారంలోకి వస్తే టీ తాగినంత సమయంలో జీవో ఇప్పిస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేశారు. కామారెడ్డిలో చేపట్టిన నిరసన దీక్షలో భాగంగా గురువారం చాయి పే చర్చ నిర్వహించారు. వీరి సమ్మెకు టీటీయూ జిల్లా అధ్యక్షుడు ఎండీ ముజీబొద్దీన్, రాజ్ కుమార్, ఎస్టీయూటీఎస్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ఆర్థిక సహాయం అందజేసి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు వాసంతి, తదితరులు పాల్గొన్నారు.