వడగళ్ల వానతో తీరని నష్టం..

0

అక్షరటుడే, బాన్సువాడ: బాన్సువాడ నియోజకవర్గంలో సోమవారం రాత్రి కురిసిన వడగళ్ల వానతో చేతికొచ్చిన పంటలు నష్టపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోతంగల్ మండలం సోంపూర్, టాక్లి, సుంకిని, దోమలేడిగి, చందూరు మండలం కారేగాం, లింగాపూర్, లక్ష్మాపూర్, ఘన్ పూర్.. బాన్సువాడ మండలం హనుమాజీపేట్, సంగోజిపేట్, పైడిమల్ తదితర గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన రాళ్ల వర్షం కురిసింది. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. తీవ్రంగా పంట నష్టం వాటిల్లింది. ఈదురుగాలులతో మొక్కజొన్న, వరి, జొన్న పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పోతంగల్ మండలంలో నష్టపోయిన పంటలను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఎకరాకు రూ.10 వేలు పరిహారం అందేలా కృషి చేస్తానని రైతులకు భరోసా ఇచ్చారు.