అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: నడుచుకుంటూ వెళ్తుండగా బైకు ఢీకొని ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. నగరంలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. హనుమాన్‌ నగర్‌కు చెందిన వేముల రాసోటి అనే వ్యక్తి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన బైకు ఢీకొట్టింది. దీంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం నగరంలోని జీజీహెచ్‌కు తరలించారు.