అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్యలోని రామమందిర ప్రాంగణంలో అపోలో ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత ఎమర్జెన్సీ కేర్‌ సేవలు ప్రారంభించారు. ఈ విషయాన్ని నటుడు రాంచరణ్‌ సతీమణి ఉపాసన ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నారు. ‘అవసరమైన వారికి సానుభూతి, గౌరవంతో వైద్యాన్ని అందించడమే నిజమైన సనాతన ధర్మం అని మాకు తాతయ్య నేర్పించారు. ఆయన మాటల నుంచి స్ఫూర్తి పొందిన మేము.. రామజన్మభూమిలో అపోలో ఉచిత ఎమర్జెన్సీ కేర్‌ సేవలు ప్రారంభించాం. ఇప్పటికే తిరుమల, శ్రీశైలం, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ లలో విజయవంతంగా ఈ సెంటర్లు ఏర్పాటు చేశాం. ఈ విషయంలో మాకు సపోర్టు చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. జై శ్రీరామ్‌’ అని ఉపాసన ట్వీట్‌ చేశారు.