అక్షరటుడే, ఇందూరు: నగరంలోని బాపూజీ వచనాలయానికి పూర్వవైభవం తేవాలని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కమిటీ అధ్యక్షుడు భక్తవత్సలం ఆధ్వర్యంలో సభ్యులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు అన్నిరకాల పుస్తకాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. లైబ్రరీ అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కమిటీ సభ్యులు తాహెర్ బిన్ హందాన్‌ను కలవగా.. ఆయన మాట్లాడుతూ వచనాలయం అభివృద్ధికి అన్నివిధాలా సహకరిస్తానన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి మీసాల సుధాకర్‌రావు, కోశాధికారి గంగాధర్‌రావు, ఉపాధ్యక్షుడు దేవిదాస్, సంయుక్త కార్యదర్శి సాంబయ్య, సభ్యులు లక్కం రెడ్డి, కోవూరి జగన్, అమంద్ విజయ్, పుల్గం హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.