అక్షరటుడే, ఇందూరు: ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని విశ్రాంత భవనంలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పోటీలను ప్రారంభించారు. క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందన్నారు. పోటీలు సోమవారం కూడా జరుగనున్నాయి. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, సంఘం అధ్యక్ష కార్యదర్శులు రవీందర్, భోజా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.