అక్షరటుడే, వెబ్‌డెస్క్: మంచు ఫ్యామిలీలో మళ్లీ లొల్లీ మొదలైంది. శనివారం రాత్రి జల్పల్లిలో మోహన్‌బాబు భార్య పుట్టినరోజు వేడుక నిర్వహించారు. కాగా.. పార్టీ జరుగుతుండగా కరెంట్ సరఫరా నిలిచిపోయిందని మంచు మనోజ్ తెలిపారు. ఉదయం వెళ్లి చూడగా కొంతమంది వ్యక్తులు ఇంట్లోకి చొరబడి జనరేటర్లో పంచదార పోసినట్లు గుర్తించానని తెలిపారు. తనతో పాటు భార్య, పిల్లలు, తల్లిని చంపే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. ఈ విషయమై ఆదివారం మనోజ్ పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.