అక్షరటుడే, వెబ్ డెస్క్: తబలా మాస్ట్రో జాకీర్ హుస్సేన్(73) కన్నుమూశారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జాకీర్ హుస్సేన్ మార్చి 1, 1951లో ముంబైలో జన్మించారు. ఏడేళ్ల వయసులో తబలా నేర్చుకున్నారు. 12 నుంచి దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చారు. ఉస్తాద్ జాకీర్ కు భారత ప్రభుత్వం పద్మశ్రీ(1988), పద్మభూషణ్(2002), పద్మవిభూషణ్‌(2023) ప్రదానం చేసింది. 1990లో భారత ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ అవార్డు, సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, 2018లో రత్న సదస్యను అందుకున్నారు.