అక్షరటుడే, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచ్‌ల కుటుంబాలు ఆగమయ్యాయని, బతుకులు బండలయ్యాయని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి వాపోయారు. మాజీ సర్పంచ్‌లకు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డిలో సుమారు రూ. 7కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. పనులు చేయించి బిల్లులు రాక వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. వెంటనే ప్రభుత్వం బిల్లులను విడుదల చేయాలని కోరారు.