అక్షరటుడే, కామారెడ్డి: అసైన్మెంట్ భూమిని పరిశ్రమ కోసం తీసుకుని బదులుగా స్థలం ఇవ్వలేదని తమకు న్యాయం చేయాలని సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామస్తులు కోరారు. ఈ మేరకు సోమవారం కామారెడ్డి ప్రజావాణిలో వారు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మూడేళ్ల క్రితం పరిశ్రమ కోసం లింగంపల్లిలో 600 ఎకరాల భూమిని తీసుకుని, బదులుగా వేరే ప్రాంతంలో స్థలం ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో భూమి ఇవ్వలేదన్నారు. అధికారులు కూడా స్పందించట్లేదని తమకు న్యాయం చేయాలని వారు కోరారు.