అక్షరటుడే, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనసభ్యులు స్పీకర్ ఛాంబర్‌లో బీఏసీ సమావేశం ముగిసింది. అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సభ ఎన్నిరోజులు నడుపుతారో చెప్పడం లేదని బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. బీఏసీ లేకుండానే బిల్లులు పెట్టడం సంప్రదాయ విరుద్ధమని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. సభను కనీసం 15 రోజులపాటు నడపాలని కోరాగా.. ప్రభుత్వం మాత్రం 3 లేదా 4 రోజులు నడుపుతామని చెబుతోందని పేర్కొన్నారు.