అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నగరంలోని 56వ డివిజన్‌లోని అహ్మద్‌పురాలో నాణ్యత లేకుండా చేపడుతున్న సీసీ రోడ్డు పనులపై విచారణ చేయాలని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పంచాయతీరాజ్ ఎస్‌ఈకి ఫిర్యాదు చేశారు. రోడ్డుకు సంబంధించి రూ. 10 లక్షలు మంజూరయ్యాయని, కానీ ఇసుకకు బదులు డస్ట్ వాడుతూ నాసిరకంగా పనులు చేస్తున్నారని వివరించారు. సంబంధిత కాంట్రాక్టర్‌ను ప్రశ్నించినప్పటికీ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని, విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.