అక్షరటుడే, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సూచీలు రోజంతా నష్టాల్లోనే కదలాడాయి. ఉదయం 133 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్.. ఇంట్రాడేలో గరిష్టంగా 582 పాయింట్లు కోల్పోయింది. 15 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమైన నిఫ్టీ.. ఇంట్రాడేలో గరిష్టంగా 167 పాయింట్లు పడిపోయింది. చివరికి సెన్సెక్స్ 384 పాయింట్ల నష్టంతో 81,748 వద్ద, నిఫ్టీ 100 పాయింట్ల నష్టంతో 24,668 వద్ద ముగిశాయి. నిఫ్టీ ఫిఫ్టీలో డాక్టర్ రెడ్డీస్, ఇండస్ఇండ్ బ్యాంక్ మాత్రమే ఒక శాతానికి పైగా లాభపడగా.. టైటాన్, అదానీ పోర్ట్స్, హిందాల్కో, బీపీసీఎల్, ఎయిర్ టెల్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా కన్స్యూమర్, హెచ్ యూఎల్ ఒక శాతానికి పైగా నష్టపోయిన స్టాక్స్ జాబితాలో ఉన్నాయి.