అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: పెండింగ్లో ఉన్న సైబర్ కేసులను లోక్ అదాలత్ ద్వారా రికార్డు స్థాయిలో పరిష్కరించి రాష్ట్రంలోనే జిల్లా ఐదోస్థానంలో నిలిచినట్లు ఇన్ ఛార్జి సీపీ సింధు శర్మ తెలిపారు. మొత్తం 174 కేసుల్లో రూ.71,52,505 రికవరీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో నష్టపోతే 1,930 నంబర్ కు సమాచారమివ్వాలని సూచించారు.