అక్షరటుడే, వెబ్‌డెస్క్: యాచక వృత్తిని సమూలంగా రూపుమాపేందుకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సిటీ కఠిన చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగా సిటీలో భిక్షాటనను పూర్తిగా నిషేధించింది. భిక్షాటన చేసేవారికి డబ్బులిచ్చే వారిపై ఏకంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని అక్కడి అధికారులు హెచ్చరిస్తున్నారు. నగరాన్ని యాచకులు లేని ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ఇండోర్ కలెక్టర్ ఆశిశ్‌సింగ్ పేర్కొన్నారు. భిక్షాటన 2025 జనవరి 1వ తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది.