అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నగరంలోని ఓ వ్యభిచారం గృహంపై పోలీసులు దాడి చేశారు. సీసీఎస్ ఏసీపీ నాగేంద్ర చారి తెలిపిన వివరాల ప్రకారం.. నగరశివారులోని పాంగ్రా కల్లు బట్టీ ప్రాంతంలో వ్యభిచారం జరుగుతుందనే సమాచారం మేరకు సోమవారం సీఐ అంజయ్య సిబ్బందితో కలిసి తనిఖీలు జరిపారు. ముగ్గురు విటురాళ్లను, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.3,500 నగదు స్వాధీనం చేసుకున్నారు.