అక్షరటుడే, కామారెడ్డిగ్రామీణం: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన దోమకొండ మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భోగిని రాకేష్(26) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గొడవల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె కాపురానికి రాకపోవడంతో మనస్థాపానికి గురైన రాకేష్ తన వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.