అక్షరటుడే, బోధన్: పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో మహిళలను వేధిస్తున్న ఇద్దరు ఆకతాయిలను సోమవారం షీ టీం సభ్యులు అరెస్ట్ చేశారు. వీరిని బోధన్ టౌన్ సీఐ వెంకటనారాయణ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి ముందు హాజరుపర్చారు. దీంతో మెజిస్ట్రేట్ రెండు రోజుల జైలు శిక్ష విధించారు.