విద్యార్థి నాయకుల ముందస్తు అరెస్ట్

0

అక్షరటుడే, బోధన్: పెండింగులో ఉన్న స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడి చేపట్టిన పీడీఎస్ యూ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. జిల్లా వ్యాప్తంగా నాయకులను అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. బోధన్లో అరెస్టు అయిన వారిలో సంఘం జిల్లా అధ్యక్షుడు గౌతమ్ తదితరులు ఉన్నారు.