అక్షరటుడే, వెబ్ డెస్క్: ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ హయత్ నగర్ నారాయణ పాఠశాలలో చోటుచేసుకుంది. లోహిత్ అనే విద్యార్థి సోమవారం రాత్రి హాస్టల్లో ఉరేసుకున్నాడు. గమనించిన స్కూల్ సిబ్బంది బాలుడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. విషయం తెలిసి పాఠశాలకు లోహిత్ కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బైఠాయించారు. పోలీసులు అక్కడికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.