అక్షరటుడే, నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలో మున్సిపల్‌ ట్రాక్టర్ల డ్రైవర్లు మంగళవారం ఉదయం చెత్త సేకరణ వాహనాలను నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కార్పొరేషన్‌ అధికారులు నిత్యం మున్సిపల్‌ ట్రాక్టర్లకు దూరాన్ని బట్టి డీజిల్ కు డబ్బులిస్తున్నారు. కానీ పెట్రోల్‌ బంకుల్లో పవర్‌ డీజిల్‌ పోస్తుండడంతో తమకు తక్కువ డీజిల్‌ వచ్చి వాహనాలు మధ్యలోనే నిలిచిపోతున్నాయని వాపోయారు. ఈ సమస్యను కార్పొరేషన్ అధికారులు పరిష్కరించాలని కోరుతూ వారు మంగళవారం ఉదయం చెత్త సేకరణను నిలిపేశారు.