అక్షర టుడే, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. దీంతో ఇండెక్స్లు వరుసగా రెండోరోజు నష్టాల బాటలోనే పయనిస్తున్నాయి. మంగళవారం ఉదయం 237 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్.. ఇంట్రాడేలో గరిష్టంగా 967 పాయింట్లు పతనమైంది. 84 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన నిఫ్టీ.. ఇంట్రాడేలో గరిష్టంగా 293 పాయింట్లు పడిపోయింది. హెవీ వెయిటేజీ ఉన్న రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఇన్ఫోసిస్ తో పాటు ఇతర బ్యాంకింగ్, ఆటో, ఐటీ, ఫార్మా స్టాక్స్ ఇండెక్స్ లను కిందికి లాగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 950, నిఫ్టీ 285 పాయింట్ల నష్టంతో కదలాడుతున్నాయి. నిఫ్టీ 50లో సిప్లా, అదాని పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్, టాటా మోటార్స్ స్టాక్స్ మాత్రమే లాభాలతో ఉండగా.. శ్రీరామ్ ఫైనాన్స్, ఎయిర్టెల్, టీసీఎస్, బజాజ్ ఫిన్సర్వ్, ఎల్టీ, ఎం అండ్ ఎం, మారుతి, బీపీసీఎల్, హిందాల్కో, పవర్ గ్రిడ్, రిలయన్స్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, గ్రాసిం, ఆక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ, ఎస్బీఐ, నెస్లే, టాటా కన్స్యూమర్ వంటి స్టాక్స్ ఒక శాతానికి పైగా నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి.