అక్షరటుడే, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా సీడీపీ, ఎస్డీపీ ద్వారా చేపట్టిన చిన్నచిన్న పనులకు సంబంధించి కూడా బిల్లులను ప్రభుత్వం ఎందుకు చెల్లించట్లేదో చెప్పాలని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. శాసనసభలో మంగళవారం ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ఆదాయం వస్తున్నప్పటికీ బిల్లులు క్లియర్ చేయకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో పలు సంఘ భవనాలు, బడులు తదితర 143 పనులకు సంబంధించి రూ.6 కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయన్నారు. వాటిని వెంటనే క్లియర్ చేయించాలని కోరారు.