అక్షరటుడే, ఆర్మూర్: పట్టణంలోని పలు ప్లాస్టిక్ విక్రయ దుకాణాల్లో మున్సిపల్ అధికారులు మంగళవారం తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకుని, జరిమానాలు విధించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను విక్రయించవద్దని దుకాణదారులను హెచ్చరించారు. తనిఖీల్లో శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, మున్సిపల్ సిబ్బంది ప్రశాంత్, రవి, అర్జున్, రాము, సంతోష్ ఉన్నారు.